ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్​'

రాష్ట్రంలో యువత ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న గ్రామ, వార్డు సచివాలయం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​ ఫలితాలు విడుదల చేశారు.

వార్డు సచివాలయం ఫలితాలు

By

Published : Sep 19, 2019, 1:42 PM IST

Updated : Sep 19, 2019, 4:31 PM IST

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్​రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. 'gramasachivalayam.ap.gov.in' వెబ్​సైట్​లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. లక్షా 26 వేల ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ఇటీవలే పరీక్షలు నిర్వహించింది. 19 రకాల పోస్టులకు 14 పరీక్షలు నిర్వహించిన సర్కారు కేవలం పదిరోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్​ 1న శిక్షణనివ్వనున్నారు. వీరు అక్టోబర్​ 2 నుంచి విధుల్లో చేరనున్నారు.

ఉత్తీర్ణత తక్కువే..

సచివాలయ పరీక్షలకు 19,50,630 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 1,98,164 మంది ఉత్తీర్ణులయ్యారు. ఓపెన్​ కేటగిరీలో 24,583, బీసీ 1,00,494, ఎస్సీ 63,629, ఎస్టీ 9,458 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఓపెన్, బీసీ కేటగిరీలో అత్యధికంగా 122.5 మార్కులు రాగా... ఎస్సీలో 114, ఎస్టీలో 108 మార్కులు వచ్చాయి. పురుష అభ్యర్థుల్లో గరిష్ఠంగా 112.5 మార్కులు వస్తే... మహిళా అభ్యర్థులకు 112.5 మార్కులు వచ్చాయి. ఇన్‌ సర్వీస్ అభ్యర్థులకు 10 శాతం మార్కులను అధికారులు కలిపారు.

ఇది రికార్డే...!

ఒకే నోటిఫికేషన్​ ద్వారా ఒక లక్షా 26 వేల 728 మందికి ఉద్యోగాలు కల్పించడం ఇదే తొలిసారని.. ఇది నిజంగా రికార్డని సీఎం జగన్​ తెలిపారు. ఎన్నికల హామీలో చెప్పినట్లుగానే పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. తక్కువ కాలంలో ఫలితాలు ప్రకటించిన అధికారులను, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. అక్టోబర్​ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని... వీటి ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని అన్నారు. అభ్యర్థులకు మంచి శిక్షణనిస్తామని... వారంతా ప్రజాసేవలో మమేకమవ్వాలని సూచించారు. వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు.

ఇదీ చూడండి:

పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

Last Updated : Sep 19, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details