ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేస్తారనే విశ్వాసంతోనే నిరవధిక రిలే నిరాహారదీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు అగ్రిగోల్డ్ బాధితులు ప్రకటించారు. సీఎం స్పందించి వచ్చేనెల 24 నాటికి రూ. 20 వేల వరకు డబ్బులు రావాల్సిన బాధితులకు చెల్లింపులు చేస్తామని, మొత్తం చెల్లింపులు జరిపే విషయమై ఓ సమగ్ర కార్యాచరణ కోసం హైపవర్‌కమిటీని ఏర్పాటు చేయడం తమ ఆందోళనలకు ప్రభుత్వం నుంచి వచ్చిన కదలికగా భావిస్తున్నారు.
సీఎం జగన్ చొరవతో అగ్రిగోల్డ్ బాధితుల దీక్ష విరమణ - అగ్రిగోల్డ్
అగ్రిగోల్డ్ బాధితులు రిలే నిరాహార దీక్షల్ని విరమించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతోనే దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు.
అగ్రిగోల్డ్ బాధితులు
ఈనెల 22వ తేదీ నుంచి విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ప్రారంభించిన రిలే నిరాహారదీక్షలను నిర్వహిస్తున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్త బాధితులు, ఏజెంట్లతో ముఖ్యమంత్రి కార్యాలయానికి యాత్రగా వెళ్లి విజ్ఞాపనపత్రాలు ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రావడంతో తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సంఘం నేతలు తెలిపారు.
ఇదీ చదవండి:ముఖ్య నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెదేపా నేతల ధ్వజం