కృష్ణాజిల్లా గుడివాడ వాంబే కాలనీలో రెండు వేల రూపాయల పాత లావాదేవీల గురించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలమధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వివాదంపై రెండు గ్రూపులు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు వేల కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ... పలువురికి గాయాలు - గుడివాడ వార్తలు
రెండు వేల రూపాయల పాత లావాదేవీల గురించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఇరువర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడులు చేసుకోగా... పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు వేల కోసం దాడి