ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సివిల్ కాంట్రాక్టర్ల 'ఇసుక' గుట్టు రట్టు... ఆరుగురి అరెస్టు... - మైలవరంలో సివిల్ కాంట్రాక్టర్ల ఇసుక అక్రమాలు

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో సివిల్ కాంట్రాక్టర్ల ఇసుక గుట్టు వీడింది. ఆన్​లైన్ ద్వారా సామాన్యుల పేరుతో అక్రమంగా ఇసుక ఉపయోగించుకున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

civil contractors illegal online sand issue in mylavaram krishna district
సివిల్ కాంట్రాక్టర్ల 'ఇసుక' గుట్టు రట్టు

By

Published : Jun 16, 2020, 9:14 PM IST

మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా పలువురి ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లను ఆన్​లైన్​లో రిజిష్టర్ చేసి సివిల్ కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక ఉపయోగించుకున్న ఉదంతం.. కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, జీ. కొండూరు మండలాల్లో సుమారు 942 టన్నుల ఇసుక ఈ విధంగా పక్కదారి పట్టినట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో విచారణలో తేలింది.

ఈ మేరకు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నూజివీడు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సివిల్ కాంట్రాక్టర్లు బల్క్ ఆర్డర్ల ద్వారా ఇసుక పొందాల్సి ఉన్నా... సామాన్యుల పేరుతో ఇసుక వాడుకోవడం చర్చనీయాంశమైంది. ఆన్​లైన్​లో ఇసుక దొరకని వారి ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో విచారణ జరిపి గుట్టు బయటపెట్టింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details