Thammareddy Bharadwaja: సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యల దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో మాట్లాడిన ఆయన.. సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమేనని తేల్చి చెప్పారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ నిలదీశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత? అంటూ సూటిగా ప్రశ్నించారు. రూ.కోట్లు పెట్టి నాయకులను ఎన్నుకుంటున్నామన్న ఆయన.. వాళ్లు మాత్రం రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారంటూ విమర్శించారు. సినీ పరిశ్రమ అంటే నిర్మాతల మండలని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దన్నారు.
'మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు.. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్
15:02 January 12
సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందన
"సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలి. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమే. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు?. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?. మీరు వచ్చినప్పుడు మీ ఆస్తులెంత? ఇప్పుడెంత?. మేము రూ.కోట్లు ఖర్చు పెట్టి రూపాయలు ఏరుకుంటున్నాం. మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. రాజకీయ నేతలు ఇంకెప్పుడు బెదిరింపులకు పాల్పడవద్దు" - తమ్మారెడ్డి భరద్వాజ, సినీ నిర్మాత, దర్శకుడు
ఇదీ చదవండి
సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్ గుర్తుందా..?: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
MP RRR: 'హీరో ఎవరో.. కీచకుడు ఎవరో తేలుద్దాం.. అంతా ఒక్కటై రావణరాజ్యాన్ని అంతం చేద్దాం'