ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫేక్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబును ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రానికి జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు.
'జగన్ ఫేక్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో సమాధానం చెప్పాలి' - ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
'జగన్ ఫేక్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో సమాధానం చెప్పాలి'