ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి జయరాంను బర్తరఫ్ చేయండి: చినరాజప్ప - nimmakayala chinarajappa update news

సీఎం జగన్​పై తెదేపా నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. మంత్రి జయరామ్​ భూ కుంభకోణం చేశారని అన్ని ఆధారాలను బయటపెట్టినా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.

chinarajappa on minister jayaram
చినరాజప్ప

By

Published : Oct 7, 2020, 3:00 PM IST

400 ఎకరాల భూ కుంభకోణంలో మంత్రి జయరాం పాత్రపై అన్ని ఆధారాలు బయటపెట్టినా.. ముఖ్యమంత్రి జగన్​ ఎందుకు స్పందించటం లేదని, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. తక్షణమే మంత్రి జయరాంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

భూ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి జయరాం ఇప్పటికే అడ్డంగా దొరికారని వ్యాఖ్యానించారు. అయినా.. ముఖ్యమంత్రి జగన్ విచారణ కమిటీ వేయకపోగా, కనీసం పట్టించుకోకపోవటం దుర్మార్గమని చినరాజప్ప మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details