సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు.
చెక్ పోస్టుల పరిశీలన
By
Published : Mar 12, 2019, 8:51 PM IST
తిరువూరులో చెక్ పోస్టుల పరిశీలన
ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. తెలంగాణ నుంచి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమతించాలని అధికారులకు సూచించారు. మద్యం, నగదు తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 33 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.