తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు దేవినేని ఉమా కుటుంబసభ్యులను గొల్లపూడిలో పరామర్శించనున్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ ఉమా చేసిన క్షేత్రస్థాయి పర్యటన తదనంతరం తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో.. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్లు కింద పోలీసులు దేవినేనిని పోలీసులు అరెస్టు చేశారు.
జైలుకు పంపారు. అయితే.. దేవినేని ఉమాపై అక్రమ కేసులు బనాయించారని తెదేపా నాయకత్వం ఆరోపిస్తూ వస్తోంది. ఇదే అంశంపై నేడు ఉమా కుటుంబ సభ్యులను కలిసి చంద్రబాబు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం స్థానిక పార్టీ క్యేడర్ను ఉద్దేశించి మాట్లాడనున్నారు.