కొంతమంది పోలీసులు అమలు చేయాల్సిన చట్టాలను వదిలేసి, వైకాపా నేతల మాటే చట్టం అన్నట్టుగా వ్యవహరించడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా నేత ఫిర్యాదు చేశారని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను, 7 ఏళ్ల చిన్నారితో సహా తీసుకొచ్చి చిల్లకల్లు స్టేషన్లో నిర్బంధించారని ధ్వజమెత్తారు. ఆ చిన్నారిలో పోలీసులకు ఏ నేరస్థుడు కనిపించాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుస్టేషన్లో భూక్యా కుటుంబీకులను అరెస్టు చేసిన సమయంలో చిన్నారి ఉన్న ఫోటోలను చంద్రబాబు ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఏడేళ్ల చిన్నారిలో ఏ నేరస్థుడు కనిపించాడు : చంద్రబాబు - కృష్ణా జిల్లా చిన్నారి అరెస్టుపై చంద్రబాబు కామెంట్స్
వైకాపా నేతల మాటే చట్టం అన్నట్టుగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేత ఫిర్యాదు చేశారని కృష్ణా జిల్లా జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను, 7 ఏళ్ల చిన్నారిని చిల్లకల్లు స్టేషన్లో నిర్బంధించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల చిన్నారిలో ఏ నేరస్థుడు కనిపించాడని చంద్రబాబు ప్రశ్నించారు.
Chandrababu
"స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్బంధించమని ఏ చట్టంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొవిడ్ నిబంధనలంటూ ఇబ్బంది పెట్టే పోలీసులకు ఇలా అందరినీ గుంపుగా ఒక్కచోట నిర్బంధించడానికి ఏ వైకాపా చట్టం అనుమతించింది. కోర్టులు వేలెత్తి చూపినా పోలీసుల తీరు మారదా? ----చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి :రైతులను ఇబ్బంది పెట్టే చర్యలొద్దు: సీఎం జగన్