ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈ సమాజం వారికెంతో రుణపడి ఉంటుంది' - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకలు

సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బందేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

chandrababu naidu wished to nurses on twitter
నర్సులకు చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు

By

Published : May 12, 2020, 4:53 PM IST

చంద్రబాబు ట్వీట్

సేవాభావానికి ప్రతిరూపం నర్సులు, వైద్య సిబ్బందే అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశంసించారు. తమ అద్వీయ సేవలతో నర్సు వృత్తికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా... మే 12ను అంతర్జాతీయంగా నర్సుల దినోత్సవంగా జరుపుకొంటున్నామని చెప్పారు. రోగులకు క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాక.. ఆత్మీయంగా సేవలు అందించే నర్సులు కదిలే ధవళ దేవతలని కొనియాడారు.

చంద్రబాబు ట్వీట్

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నర్సులు ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్న తీరు ప్రశంసనీయమని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అంకింతభావంతో రోగులకు సేవలందిస్తున్న నర్సులందరికి శుభాకాంక్షలు, కృతాజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ సమాజం వారికెంతో రుణపడి ఉంటుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details