ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారీ సేవలు స్ఫూర్తిదాయకం... విప్లవ వీరులకు వందనం' - taja news of bala gandhar thilak

జాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా వారి సేవలను గుర్తుచేశారు. వ్యక్తి స్వాతంత్య్రం, భావ స్వాతంత్య్రం కోసం తిలక్ పరితపించారని కొనియాడారు.

బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్  జయంతి సందర్భంగా  చంద్రబాబు ట్విట్
బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్

By

Published : Jul 23, 2020, 1:45 PM IST

బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్

'స్వాతంత్య్రం నా జన్మహక్కు' అని చాటిన జాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తి భారతీయులందరిలో ప్రతినిత్యం సజీవమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. తిలక్ 164వ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తిలక్ స్ఫూర్తితో పౌర హక్కుల సాధనే మన లక్ష్యం కావాలని, అదే లోకమాన్యుడికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ధైర్యసాహసాలకు మారుపేరు చంద్రశేఖర్ ఆజాద్ అని చంద్రబాబు తెలిపారు. చంద్రశేఖర్ ఆజాద్ 114వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్వాతంత్రం చూపిన తెగువను గుర్తుచేసుకున్నారు. భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం ప్రాణాలనే తృణప్రాయంగా త్యజించిన విప్లవవీరుడు ఆజాద్ అని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details