ys vivekamurder case : ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. భాస్కర్‌రెడ్డికి ప్రత్యేక కేటగిరీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం సిఫార్సు చేసింది. వివేకా హత్య కేసులోసీబీఐ అరెస్టు చేసిన భాస్కర్‌రెడ్డి గత నెల 16 నుంచి చంచల్‌గూడ జైళ్లో ఉన్నారు. తన వయసు, అనారోగ్యం, సామాజిక స్థితి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కేటగిరీ కల్పించాలని భాస్కర్ రెడ్డి కోరారు. మరోవైపు భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.
ITR Filing Compulsory : ఆదాయం లేకపోయినా ఐటీ రిటర్నులు తప్పనిసరా?
మరణించే ముందు వివేకానంద రెడ్డి రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలన్న సీబీఐ ప్రయత్నంపై నిందితులు అభ్యంతరం తెలిపారు.సీబీఐ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తన నుంచి ఎలాంటి కౌంటరు లేదని అప్రూవర్ దస్తగిరి తెలిపారు. సీబీఐ తరఫున వాదనల కోసం పిటిషన్‌ను ఈనెల 5కి న్యాయస్థానం వాయిదా వేసింది. వివేకా హత్య కేసు ట్రయల్‌లో సీబీఐ పీపీకి సహకరించేందుకు తనకు అనుమతివ్వాలన్న సునీత పిటిషన్‌పై కూడా నిందితులు అభ్యంతరం తెలిపారు. గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేయగా.. శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కౌంటర్లు దాఖలు చేయలేదు. పిటిషన్‌పై వాదనలు వినిపించాలని సునీతను ఆదేశించిన కోర్టు విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.