ఓ బాలికను మోసం చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కృష్ణా జిల్లా గన్నవరం(gannavaram) ఎస్సై రమేష్ తెలిపారు. మండల పరిధిలోని వెంకటనరసింహాపురం కాలనీలో పొందుగల అవినాష్(avinash) అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోని బాలికతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ(love)గా మారింది. బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన అవినాష్... ఆమెతో శారీరకంగా కలిశాడు. వివాహం చేసుకోవాలని బాధితురాలు కోరడంతో నిరాకరించాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో చట్టం(pocso act) కింద కేసు నమోదు చేశారు.
CHEATING: బాలికను మోసగించిన యువకుడు... పోక్సో చట్టం కింద కేసు నమోదు - gannavaram latest news
పెళ్లి చేసుకుంటానని బాలికను(girl child) నమ్మించి ఆమెతో శారీరకంగా కలిశాడు. వివాహం చేసుకోవాలని కోరడంతో ముఖం చాటేశాడు ఆ ప్రబుద్ధుడు. మోసపోయానని గ్రహించిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు(complaint) చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది.
యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు