పైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అప్పు చెల్లించినా వేధిస్తున్నారంటూ సూసైడ్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కృష్ణా జిల్లా పమిడిముక్కుల మండలం ముళ్లపూడికి చెందిన శివమల్లేశ్వరరావు ఓ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం కొందరి దగ్గర అప్పులు చేశాడు. అయితే అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించినా తనను ఫైనాన్షియర్లు వేధిస్తున్నారంటూ అతను ఓ లేఖ రాసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.