ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని భవన నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారని విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీ వల్ల తామంతా రోడ్డున పడ్డామని సంఘం అధ్యక్షుడు శివయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక ధరలను తగ్గించి..తగినంత సరఫరా చేయాలని ప్రభుత్నాన్ని డిమాండ్ చేస్తున్నామని భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు అన్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని కోరారు.