ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న... శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌ను కోరారు. తెదేపా నుంచి ఎన్నికైన వీరు... పార్టీ ఫిరాయించి వైకాపాలో కొనసాగుతున్నారని షరీఫ్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో జరిగిన ఓటింగ్‌లో ఇరువురూ పార్టీ విప్ ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారని ఫిర్యాదు చేశారు. తాము చేసిన ఫిర్యాదుపై విచారణకు హాజరు కావాల్సి ఉన్నా గత 8 నెలలుగా ఏదో సాకు చెప్పి తప్పించకుంటున్నారని విమర్శించారు.
ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయండి: బుద్దా
తెదేపా ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీత పార్టీ విప్ ఉల్లంఘించారంటూ ఆ పార్టీ చేసిన ఫిర్యాదుపై మండలి ఛైర్మన్ షరీఫ్ మరోసారి విచారణ చేపట్టారు. వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న... ఛైర్మన్‌ను కోరారు.
Buddha Venkanna
మండలి ఛైర్మన్ చర్యలు తీసుకోక ముందే నైతిక బాధ్యత వహిస్తూ ఇరువురూ తమ పదవులకు రాజీనామా చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. పోతుల సునీత తల్లికి కరోనా సోకినందున విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని ఆమె తరఫు న్యాయవాది ఛైర్మన్‌ను కోరారు. ఈ క్రమంలో విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. పార్టీ ఫిరాయింపులపై పూర్తి సాక్ష్యాధారాలతో ఓ పిటిషన్‌ను ఛైర్మన్‌కు త్వరలోనే ఇవ్వనున్నట్లు బుద్ధా వెంకన్న తెలిపారు.