కృష్ణాజిల్లా చల్లపల్లి హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దాసరి ఆదిత్య మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా బంధువులు అడ్డుకున్నారు. బాలుడి మృతికి కారణమైన వారిని పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దుతున్న అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు బాధిత బంధువులను సముదాయించారు. త్వరలో బాధ్యులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. అటు తరువాత బాలుడి మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
చల్లపల్లి హస్టల్ బాలుడి మృతి ఘటనలో బందువుల ఆందోళన - కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా చల్లపల్లి హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దాసరి ఆదిత్య మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా బంధువులు, స్థానికులు అడ్డుకున్నారు.
చల్లపల్లి హాస్టల్‌లో అనుమానాస్పదంగా బాలుడి మృతి