పాఠశాలల పునః ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలు పంపిణీ చేసేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బడులు తెరిచే నాటికే పుస్తకాలు అందించాలన్న లక్ష్యంతో పంపిణీ చురుగ్గా చేస్తోంది. కృష్ణా జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కలిపి 13 లక్షల 32 వేలకుపైగా పుస్తకాలు కావాలని అధికారులు తెలపగా.. ఇప్పటికే 10 లక్షల 28 వేల 250 పుస్తకాలు స్కూళ్లకు చేరాయి. మరో 3 లక్షలకుపైగా పంపిణీ పూర్తి కావాల్సి ఉంది.
జిల్లా పరిధిలోని 50 మండలాలకు 2 విడతలుగా పుస్తకాలు అందిస్తున్నారు. గతంలో జిల్లా విద్యాశాఖ నుంచి మండల ఎమ్మార్సీ భవనాలకు పుస్తకాలు చేరవేసేవారు. ప్రస్తుతం పాఠశాలల వద్దకే నేరుగా పంపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయలకు ఇబ్బందుల్లేకుండా ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్న విద్యాశాఖ... అన్ని పాఠశాలలకు నేరుగా పార్సిల్ చేస్తోంది.