ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో పుస్తకాల పండుగకు వేళాయెరా!

వచ్చేసింది.. వచ్చేసింది.. పుస్తకాల పండుగ వచ్చేసింది. నాలుగేళ్లుగా విజయవాడ పుస్తక ప్రియులకు ఉచితంగా పుస్తకాలను అందిస్తున్న సర్వోత్తమ గ్రంథాలయం.. ఈసారీ 50 వేల పుస్తకాలతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. శనివారం మొదలైన ఈ పుస్తకాల పండగ.. ఆదివారంతో ముగియనుంది.

By

Published : Apr 21, 2019, 3:11 PM IST

విజయవాడలో పుస్తకాల పండుగకు వేళాయెరా...

విజయవాడలో పుస్తకాల పండుగ

పుస్తకం హస్త భూషణం అంటారు. తరాలు మారినా.. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులోకి వచ్చినా పుస్తకం విలువ ఎప్పటికీ మారదు. గతంతో పోలిస్తే పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గినా.. ఇప్పటికీ స్మార్ట్​ఫోన్ తెరపై కన్నా.. పుస్తకంలోని అక్షరాలు చదివేవారూ ఉన్నారు. అలాంటివారికి ఉచితంగా పుస్తకాలు అందజేస్తూ.. నేటి తరానికీ అక్షరాల విలువను తెలుపుతోంది సర్వోత్తమ గ్రంథాలయం. నాలుగేళ్లుగా ఎంతోమందికి, ఎన్నో పుస్తకాలను ఉచితంగా అందజేసిన సర్వోత్తమ గ్రంథాలయం.. ఈ ఏడూ ఉచితంగా పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. 50 వేల పుస్తకాలను పాఠకుల ముందు ఉంచింది. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, సాహిత్యం, చరిత్ర వంటి అనేక రకాలు అందుబాటులోకి తెచ్చింది. తమకు కావలసిన బుక్స్​ను తీసుకునేందుకు విద్యార్థులు, పుస్తక ప్రియులు తరలివస్తున్నారు. ఒక్కొక్కరికీ 2 పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు. గ్రంథాలయాలకు, విద్యాలయాలకు 100 పుస్తకాల వరకూ అందజేస్తున్నారు. పాఠకులు తమకు కావలసిన పుస్తకాలు ఎంపిక చేసుకుని.. తమ ఆనందాన్ని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. శనివారం మొదలైన ఈ పుస్తకాల పండగ.. ఆదివారంతో ముగియనుంది.

ABOUT THE AUTHOR

...view details