బొన్సాయ్ మొక్కల పెంపకం ఆమెకు అలవాటు కాదు.. ఆమె జీవితంలో భాగం. అందుకే అమరావతి బొన్సాయ్ సొసైటీ స్థాపించి పొట్టి వృక్షాల ప్రేమికులందరినీ ఒకచోట చేర్చుతున్నారు. ఈ బృందంలో 40 మంది సభ్యులు ఉన్నారు. బొన్సాయ్ పెంపకం సులువు కాదు... ప్రత్యేక శిక్షణ పొందితే తప్ప వాటిని సంరక్షించడం కుదరదు. అందుకే బొన్సాయ్పై ఆసక్తి ఉన్నవారికి ఉచిత శిక్షణ అందిస్తున్నారు. తర్వాత తరాలకు వృక్ష సంపద అందించేందుకు ఈ బృందం కృషిచేస్తోంది. వీరి కృషికి మెచ్చిన అమరావతి అభివృద్ధి సంస్థ ఎకరం స్థలం కేటాయించి ప్రోత్సహించింది.
పొట్టి వృక్షం... పెద్ద ఆశయం
వృక్షో రక్షతి రక్షితః సూత్రాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారామె. అభివృద్ధి పేరిట కనుమరుగైపోతున్న వృక్షాలు చూసి అందరిలా కలవరపడ్డారు. అక్కడితో ఊరుకోలేదు. 'బొన్సాయ్' పద్ధతిలో భారీ వృక్షాలను కుండీల్లో పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వృక్షాల సంరక్షణపై మరికొంతమందికి తర్ఫీదునిస్తూ... పచ్చదనానికి ఊపిరి పోస్తున్నారు.
బొన్సాయ్ మొక్కలు
ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న అమృతకుమార్... నగరంలో ఎక్కడ ఫల, పుష్ప ప్రదర్శన జరిగినా.. బొన్సాయ్‌లతో స్టాల్ ఏర్పాటు చేస్తారు. బొన్సాయ్ అనగానే అమృతకుమార్ పేరు గుర్తొచ్చేలా సాగుతున్న ఆమె ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం.
Last Updated : Mar 2, 2019, 8:07 PM IST