Bomb Explosion in Husnabad Bus Stand: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ద్విచక్ర వాహనాల పార్కింగ్ సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఉదయం ప్రాంతంలో బాంబులు పేలిన శబ్దాన్ని విన్న తోపుడు బండి వ్యాపారస్థుడు.. వెంటనే సమాచారాన్ని ఆర్టీసీ సిబ్బందికి తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఐదు నాటు బాంబులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులు అక్కడికి ఎలా వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
హుస్నాబాద్‌లో నాటు బాంబుల కలకలం.. పోలీసుల దర్యాప్తు - తెలంగాణ విశేషాలు
Bomb Explosion in Husnabad Bus Stand: హుస్నాబాద్‌లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. బాంబులు పేలుడు శబ్దాలు విన్న స్థానికుడు.. పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన బాంబుస్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఐదు నాటు బాంబులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
నాటు బాంబుల కలకలం..