ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం - black magic in ramanakkapeta zp high school

రమణక్కపేట జిల్లా పరిషత్ పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం
ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం

By

Published : Nov 18, 2021, 7:41 PM IST

కృష్ణా జిల్లా రమణక్కపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చేతబడులు, క్షుద్ర పూజల కలకలం రేగింది. క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు, కొన్నిచోట్ల రక్తపు మరకలు కనిపించాయి. ఇవన్నీ చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఇదంతా చేసిందెవరో, ఎందుకు చేశారో అని భయపడ్డారు. క్షుద్రపూజలు జరిగినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు.. ప్రధానోపాధ్యాయురాలు శారద తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details