ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 27, 2022, 9:35 AM IST

ETV Bharat / state

నిబంధనల పేరుతో వినాయక ఉత్సవాలకు అడ్డంకులు సరికాదన్న సోము వీర్రాజు

వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్సవ కమిటీలను పోలీసులు భయపెట్టడం మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే, పెద్దఎత్తున ప్రజాఉద్యమాన్ని చేపడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.

somu
somu


వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని.... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్సవ కమిటీలను పోలీసులు భయపెట్టడం మానుకోవాలన్నారు.ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వాడవాడల్లో జరుపుకోవడం అనాదిగా వస్తున్న హిందూ ధర్మాచారం అన్న సోము..అందుకు విరుద్ధంగా ఈ సంవత్సరం వేడుకల్లో డీజే సౌండ్ సిస్టంగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వీలు లేదు అనడం ఏంటని ప్రశ్నించారు. అందుకోసం ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే... పెద్దఎత్తున ప్రజాఉద్యమాన్ని చేపడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.

ఇవి చదవండి: అప్పు ఎక్కడ, ఎలా దొరుకుతుంది

For All Latest Updates

TAGGED:

bjp

ABOUT THE AUTHOR

...view details