రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా భాజపా ప్రతినిధులు పన్నెండు గంటల నిరసన దీక్ష చేశారు. విజయవాడ ఎన్కేపాడులోని తన నివాసం నుంచి వెలగపూడి గోపాలకృష్ణ, హైదరాబాద్ నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ సంఘీభావ నిరసనదీక్షలు నిర్వహించారు. స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని వారు కోరారు. తమ పార్టీ రాష్ట్ర శాఖ అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని తెలిపారు. రాజధానిని తరలించవద్దని రైతులు, వారి కుటుంబ సభ్యులు 121 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజధాని అంశంపై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా భాజపా నేతల నిరసన దీక్ష - capital
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనకు భాజపా నాయకులు మద్దతు తెలిపారు. తమ తమ నివాసాల నుంచే పన్నెండు గంటలు సంఘీభావ నిరసన దీక్ష చేశారు.
రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా భాజపా నేతల నిరసనదీక్ష