అడ్డొచ్చిన కుక్క.. బైక్పై నుంచి పడి వ్యక్తి మృతి - man dead
కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తుండగా రోడ్డుపై కుక్క అడ్డురావడంతో ప్రమాదవశాత్తు వ్యక్తి కిందపడి మరణించాడు.
కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి బైక్పై నుంచి పడి ప్రమాదవశాత్తు మరణించాడు. విశ్వనాథపల్లిలో వడ్రంగి పనికి సామాన్లతో వెళ్తుండగా హెస్కూల్ వద్దకు వచ్చేసరికి కుక్క అడ్డురావడంతో దాన్ని తప్పించే క్రమంలో పడిపోయాడు. దాంతో అతని తల వెనుక భాగంలో బలమైన గాయం తగలడం వల్ల అవనిగడ్డ ఆసుపత్రి తరలించారు. మెరుగైన చికిత్సకి విజయవాడ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేశారు.