ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోటును ఎలాగైనా తీసి గేటు మూయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రవిత్ర సంగమం నుంచి కొట్టుకువచ్చిన బోటు బ్యారేజీ 68వ గేటు వద్ద ఇరుక్కుపోయింది. బోటును తీసేందుకు జాతీయ విపత్తు నిర్వహక బృందాలు, జలవనరుల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పడవ రాకపోవటంతో ఇతర ప్రాంతాల నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చి బోటును తీసేందుకు యత్నిస్తున్నారు. ఈ చర్యలపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
ఇరుక్కుపోయిన బోటు..తీసేందుకు తిప్పలు - officer
ప్రకాశం బ్యారేజీ వద్ద గేటులో ఇరుక్కున్న బోటును బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ