ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపు మ్యూజియం... ఇకపై కమనీయం రమణీయం!

ఒకప్పుడు విక్టోరియా మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత బాపు మ్యూజియంగా పేరుమార్చుకుని అందని మన్ననలు పొందింది. ప్రస్తుంతం సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. అక్కడి దృష్యాలు కమనీయంగా... ఆ వాతావరణం రమణీయంగా ఉండేందుకు యంత్రాంగం శ్రమిస్తోంది.

By

Published : Jul 26, 2019, 4:12 AM IST

'కొత్త హంగులతో బాపు మ్యూజియం'

'కొత్త హంగులతో బాపు మ్యూజియం'

శతాబ్దాల ఘన చరితకు సాక్ష్యాలుగా నిలిచే ఎన్నో శిలా రూపాలు... వందల ఏళ్ల నాటి జీవన విధానాన్ని కళ్ళకు కట్టే ఆనవాళ్లు... రాజుల కాలంనాటి వస్తువులు... ఇలా ఎన్నో విశేషాలతో విజ్ఞానం పంచేవి మ్యూజియాలు. వాటిలో బాపు ప్రదర్శనశాల ఒకటి. విజయవాడలోని ఈ మ్యూజియం.. ఒకప్పుడు విక్టోరియా మ్యూజియంగా ప్రసిద్ధి. తర్వాత బాపు మ్యూజియంగా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ ప్రదర్శన శాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు... పురావస్తు శాఖ కృషి చేస్తోంది. కొత్తగా రెండతస్తుల భవన నిర్మాణంతోపాటు గ్యాలరీల ఏర్పాటు జరుగుతోంది.

కొండపల్లి కోటకు సాంకేతిక హంగులు అద్దినట్టే... బాపు మ్యూజియంలోనూ అధునాతన సాంకేతికత జోడిస్తోంది. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి... ట్రాక్ వెంబడి పురాతన శిలలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆగ్మెంట్ రియాలిటీ సాయంతో... ప్రతి శిల్పం మాట్లాడేలా తీర్చిదిద్దుతున్నారు. బౌద్ధ చరిత్ర సహా చారిత్రక విశేషాలు తెలిపేలా తెరలు సిద్ధం చేస్తున్నారు. సందర్శకులను కట్టిపడేసేలా 3డీ యానిమేషన్‌తో ఆడియో, వీడియో గదిని రూపొందిస్తున్నారు.

కొన్ని నెలల క్రితమే పనులు పూర్తికావాల్సి ఉన్నా... నిధుల మంజూరులో జాప్యం, ఎన్నికల నియమావళి కారణంగా పనులు మందగించాయి. గత నెల నుంచి ఊపందుకున్న పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details