అసాధారణమైన జ్ఞాపక శక్తితో పలు అవార్డులు సొంతం చేసుకున్న ఈ బాలిక పేరు మున్నంగి హాసిని.. విజయవాడకు చెందిన ఈ బాలిక గతంలో చాలాసార్లు గణితానికి సంబంధించిన అంశాలలో అసాధారణ ప్రతిభ కనబరిచి పలు అవార్డులు, ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది.
వాటితో అగకుండా మరిన్నీ ప్రయత్నాలు చేస్తూ ఆంగ్లంలో మ్యాజిక్ స్క్వేర్ గా పిలిచే అంకెల పదబంధంలో నిలువు, అడ్డం సమానంగా ఉండే గదుల్లో ఎటు కూడిన ఒకే మొత్తం వచ్చే విధంగా అంకెలతో గళ్ళు అవలీలగా పూర్తి చేస్తోంది.
భారత మహిళ అనే అంశంపై అనర్గళంగా మాట్లాడి ఆహుతులను అలరించిన ఈ చిన్నారి...ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అనేక మెడల్స్ సొంతం చేసుకున్న హాసిని... విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో నిర్వహించిన పోటీలో గణితశాస్త్రంలో అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శించి మరోసారి ఛాంపియన్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జ్ఞాపికను కప్పును స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా హాసినీ అందుకుంది. ఇటువంటి బాల మేధావులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహిస్తుందని.. హాసినికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు.