విజయవాడ నోరి పిల్లల ఆసుపత్రి వివాదంలో చిక్కుకుంది. ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించిన కొన్ని గంటలకే నవజాత శిశువు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమంటూ.... శిశువు తల్లిదండ్రులు ఆరోపించారు. బాలుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. కనీసం తమ బిడ్డను ముట్టుకోకుండా మందులు ఇచ్చారని.. టీటీ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పసుపు రంగులోకి బిడ్డ మారిపోయినా పట్టించుకోలేదని ఆరోపించారు. 9 నెలలు మోసిన తనకు.. మృత శిశువును చేతికి అందించారని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న దశలో పోలీసులు జోక్యం చేసుకుని బాలుడి తల్లిదండ్రులను సముదాయించారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ధర్నా విరమింపజేశారు.
'డాక్టర్ల నిర్లక్ష్యమే.. మా బిడ్డను చంపేసింది' - baby died
ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేసిన కొన్ని గంటలకే నవజాత శిశువు మరణించిన ఘటన విజయవాడలో వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమంటూ... శిశువు బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
'డిఛార్జ్ చేసిన కొన్ని గంటలకే నవజాత శిశువు మరణం'