devotees protest: విజయవాడ రైల్వే స్టేషన్ ముందు అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి శబరిమలకు టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు వెళ్లగా.. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయలేదని చెప్పడంతో భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా శబరిమల వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసేవారని.. ఈ ఏడాది ఇప్పటివరకు వాటి వివరాలు చెప్పట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా శబరిమల వెళ్లేందుకు కొన్ని రైళ్లను అధికారులు అందుబాటులో ఉంచారు. అయితే ఈ సీజన్లో విజయవాడ నుంచే వేల మంది భక్తులు అయ్యప్పమాల వేసుకుని దర్శనానికి వెళ్తున్నారని గురుస్వాములు చెబుతున్నారు.
ప్రత్యేక రైళ్ల కోసం.. విజయవాడ రైల్వే స్టేషన్ ఎదుట అయ్యప్ప భక్తుల ఆందోళన - శబరిమల
Devotees Protest: ఎంతో భక్తిశ్రద్దలతో దీక్ష పూర్తి చేసి శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకోవాలనుకున్న భక్తులకు నిరాశే ఎదురవుతోంది. విజయవాడ నుంచి తగినన్ని రైలు సర్వీసులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతీ ఏడాది ప్రత్యేక రైళ్లు ఉండేవని కానీ ఈ సంవత్సరం ఇంకా ఏర్పాటు చేయలేదని భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అయ్యప్ప భక్తులు
విజయవాడ నుంచి జనవరి 9, 10, 11 తేదీల్లో రైళ్లను అధికారులు ఏర్పాటు చేసేవారు. ఇప్పటివరకు వాటి వివరాలు అందుబాటులో ఉంచలేదని అయ్యప్ప స్వాములంటున్నారు. రైల్వే అధికారులు విజయవాడ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: