నవ్యాంధ్ర నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను సివిల్స్ సర్వీస్‌కు ఎంపికయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నామని పవన్ కుమార్స్ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ పవన్ కుమర్ తెలిపారు. విజయవాడలోని పీబీ సిద్దార్ధ కళాశాలలో సివిల్స్ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఆ సంస్థ.. ఇంటర్ నుంచే పిల్లలను సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పట్టుదల, కృషితో కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివితే ఐపీఎస్ సాధించడం కష్టం కాదని చెప్పారు. పలువురు సివిల్స్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై అభ్యర్థులకు సూచనలు ఇచ్చారు.
ఇంటర్ నుంచే సన్నద్ధం... సివిల్స్ సులభం... - విజయవాడ
సివిల్స్.. చాలామంది కల. అయితే సరైన ప్రణాళిక, శిక్షణ లేక రాష్ట్ర అభ్యర్థులు అందులో విఫలమవుతున్నారు. అటువంటి వారికి సరైన దిశానిర్దేశం చూపి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యేలా చేయాలన్నదే తమ లక్ష్యమని పవన్ కుమార్స్ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ అన్నారు.
విజయవాడలో సివిల్స్‌పై అవగాహన సదస్సు