ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిథిలావస్థకు అవనిగడ్డ తహశీల్దార్​ కార్యాలయం.. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్​ - andhra pradesh latest news

100 years Office: పెంకులు లేచిపోయాయ్‌.. తలుపులు చెదలు పట్టాయ్‌.. ఎప్పుడు ఎక్కడ ఏం ఊడిపడుతుందో తెలియదు. సిబ్బంది ఏరోజుకారోజు..గండం గడిచిందనుకోవడమే. వానాకాలమైతేై.. ఇవాళ సిద్ధం చేసిన దస్త్రాలు..రేపటి వరకూ తడవకుండా ఉంటే చాలని వరుణ దేవుడికి దణ్ణం పెట్టుకోవాల్సిందే... వందేళ్లనాటి ఓ కార్యాలయ శిథిలావస్థ ఇది.

old office
old office

By

Published : Jul 10, 2022, 8:27 AM IST

Updated : Jul 10, 2022, 10:53 AM IST

శిథిలావస్థకు అవనిగడ్డ తహశీల్దార్​ కార్యాలయం

Avanigadda MRO office: కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వర్షం కురిస్తే ఆఫీసంతా జలమయమవుతుంది... మోకాళ్ల లోతు నీళ్లల్లోనే పనులు చేయాల్సిన దుస్థితి.. 1912వ సవత్సరంలో నిర్మించిన ఈ కార్యాలయం.. ఎప్పుడు కూలుతుందో తెలియడంలేదు. గత ప్రభుత్వం 90 లక్షలతో కొత్త భవన నిర్మాణం చేపట్టింది. గ్రౌండ్‌ప్లోర్ పూర్తైంది. ఇక మిగిలింది.. మొదటి అంతస్తులో ఫ్లోరింగ్, విద్యుత్ పనులు మాత్రమే. వాటినీ త్వరగా పూర్తి చేసి.. కార్యాలయ ప్రవేశం చేయాల్సిన అధికారులు ఇంకా ఈ పాడుబడ్డ పెంకుటింట్లోనే పనులు కానిస్తున్నారు.

వర్షం కురిస్తే చాలు.. కార్యాలయంలో రోజుల తరబడి నీరు నిలిచిపోతోంది. కొన్నిసార్లు సిబ్బంది కుర్చీల పక్కనే.. పెంకులు పడిన సందర్భాలున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులకు ఒకే ఒక్క సబ్-ట్రెజరీ కార్యాలయమూ..ఈ భవనంలోనే ఉంది. ఇక జనమైతే.. ఏదైనా పని కోసం వెళ్తే.. ప్రాణాలతో బయటపడతామా అని ప్రశ్నించుకునే పరిస్థితి. దాదాపు పూర్తైన కొత్త భవనంలో విధులు నిర్వర్తించడానికి సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్ పనులతో పాటు కొన్ని చిన్నచిన్నపనులు పూర్తికావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. అంచనా మొత్తాన్ని ప్రభుత్వానికి పంపామని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 10, 2022, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details