కృష్ణా జిల్లా మైలవరం గ్రామపంచాయతీ పరిధిలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంచాయతీలకు చెత్త సేకరణకు ఎలక్ట్రికల్ ఆటోలు కేటాయించింది. అయితే ఈ ఆటోలు కొన్ని సాంకేతిక కారణాలతో మొరాయిస్తున్నాయి. ఫలితంగా.. చెత్త సేకరణ క్లిష్టంగా మారింది. మొత్తం ఐదు ఆటోలను అప్పగించగా...వాటిలో ఇప్పుడు రెండు ఆటోలే పని చేస్తున్నాయి. మరమ్మతులకు నోచుకోని ఈ ఆటోలు.. మైలవరానికి తరలించారు. అక్కడి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో ఉంచారు.
సులువుగా పని కానిస్తాయనుకుంటే... అసలుకే పని చేయట్లేదు! - krishna district municipal corporation
చెత్త సేకరణ కోసం కేటాయించిన ఎలక్ట్రానిక్ ఆటోలు.. సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్తో ఈ ఆటోలు పూర్తిగా పని చేయని కారణంగా.. కార్మికులకు చెత్త సేకరణ సమస్యగా మారుతోంది.
సంపద తయారీ కేంద్రం వద్ద ఉన్న మొరాయించిన ఆటోలు
Last Updated : Aug 8, 2019, 12:49 PM IST