రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆటో కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా రవాణాలో భాగమైన ఆటోలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
లాక్డౌన్ ఉన్న రెండు నెలలకు ప్రతి ఆటో కార్మికుని కుటుంబానికి 10 వేలు రూపాయలు ఆర్ధిక సాయం చేయాలన్నారు. వాహనమిత్రలో సగం మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందని... మిగిలిన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాలని కోరారు. వాహనాలపై కేసులు ఎత్తివేసి, రుణాలకు 6 నెలల మారిటోరియం విధించాలన్నారు.