దుర్గమ్మకు ఆషాడ సారె సమర్పణకు విశేష స్పందన - ఇంద్రకీలాద్రిపై పవిత్ర సారె కార్యక్రమం
ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తోన్న ఆషాడ పవిత్ర సారె సమర్పణకు కార్యక్రమానికి భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆషాడమాసం ప్రారంభం సందర్భంగా నిన్న పవిత్ర సారె కార్యక్రమం ఆరంభమైంది.
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న ఆషాడ పవిత్ర సారె కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆషాడమాసం ప్రారంభం సందర్భంగా నిన్న పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ చిట్టినగర్‌లోని దేవాలయం నుంచి అక్కడి పాలకమండలి, మహిళలు అమ్మవారి ఆలయానికి సారె తీసుకొచ్చారు. 200 మంది కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించారు. వీరికి ఆలయ ఛైర్మన్ పైలా సోమినాయుడు స్వాగతం పలికారు. పవిత్ర సారె సమర్పించిన అనంతరం అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి