ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తే నగదు అవార్డులు'

ఆర్టీసీ మరింత ప్రజాదరణ పొందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సంస్థ ఎండీ ఆర్పీ ఠాకూర్ ఆదేశించారు. పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలని సూచించారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.

By

Published : Jan 20, 2021, 11:40 PM IST

Published : Jan 20, 2021, 11:40 PM IST

APSRTC MD RP Thakur
APSRTC MD RP Thakur

ప్రయాణికులకు నాణ్యతతో, మెరుగైన సేవలందించే సిబ్బందికి నగదు అవార్డులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ నిర్ణయించారు. డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్​వైజర్లకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఆయన... ఆర్టీసీ మరింత ప్రజాదరణ పొందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, బస్సుల నిర్వహణ, సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఈడీలు, అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు.

పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలని ఠాకూర్ సూచించారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం సహా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు పాటిస్తూ సేవలు విస్తృతం చేయాలని సూచించారు. కరోనా విజృంభణ సమయంలో బాధ్యతాయుతంగా సేవలందించిన సిబ్బందిని ఎండీ అభినందించారు. బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి(ఓఆర్) సహా నడిచే కిలోమీటర్లు మునుపటి స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details