ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

APSRTC: బంపర్ ఆఫర్.. ఒక టికెట్​పై.. రెండు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం! - ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణం

Multi Journey : మార్గమధ్యంలో పని ఉంటే బస్సు దిగి.. పని పూర్తయ్యాక ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేలా ఆర్టీసీ మల్టీ జర్నీ రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఒకే టికెట్​పై రెండు బస్సుల్లో ప్రయాణించే వీలుంటుంది. దీంతో అధిక చార్జీల నుంచి మినహాయింపుతో పాటు అవసరం కూడా తీర్చుకునేలా రూపొందించిన ఈ విధానం ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

aps rtc
aps rtc

By

Published : May 4, 2023, 7:40 PM IST

APSRTC Multi City Journey Reservation : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఓ ప్రయాణికుడు.. మార్గమధ్యలో సూర్యాపేటలో బస్సు దిగి ఓ రెండు, మూడు గంటలు తన పని చూసుకుని తిరిగి అదే టికెట్​పై వేరే బస్సులో గమ్యం చేరుకోవచ్చు. మళ్లీ కొత్తగా టికెట్ తీసుకోకుండా, అధిక చార్జీ చెల్లించాల్సిన అవసరం లేకుండా మొదట బుక్ చేసిన టికెట్ పైనే ప్రయాణం కొనసాగించవచ్చు. తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది. ఏపీఎస్ ఆర్టీసీ కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం ప్రయాణికులకు మేలు చేయనుంది.

ప్రయాణికులకు సౌకర్యవంతం.. ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కొత్త విధానాన్ని పరిచయం చేస్తోంది. ఈ విధానంతో ఒకే టికెట్ పై రెండు బస్సుల్లో ప్రయాణం చేసేందుకు వీలుంటుంది. తద్వారా రాయితీ పొందడంతో పాటు.. మార్గమధ్యలో పనులు పూర్తి చేసుకుని మళ్లీ ప్రయాణం సాగించే వీలుంది.

మల్టీ జర్నీ.. దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త టికెట్ల జారీ విధానాన్ని తీసుకువచ్చింది. కొత్తగా మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకే టికెట్ జారీ చేసే విధానాన్ని తీసుకువచ్చింది. వెళ్లాల్సిన ప్రాంతానికి నేరుగా బస్సు సదుపాయం లేనప్పుడు, ఒక టికెట్ తో రెండు బస్సుల్లో ప్రయాణం చేసి గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉన్న వారికి మాత్రమే సదుపాయం కల్పించింది.

ముందస్తు బుకింగ్.. మేజర్ బస్టాండ్ల మీదుగా వెళ్లే ప్రయాణికులకు ఈ కొత్త విధానం వెంటనే అమల్లోకి తెచ్చింది. ప్రయాణికులు వెళ్లాల్సిన రూట్ లో మార్గ మధ్యలో మేజర్ బస్టాండ్ లో దిగి అక్కడ మరో బస్సు ఎక్కి గమ్యస్థానం చేరుకోవచ్చు. రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకేసారి ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్టీసీ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ముందుగా బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ప్రయాణికులు రెండు వేర్వేరు బస్సు సర్వీసుల్లోనూ ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చుని తెలిపారు. బస్సు సర్వీసు బట్టి నిర్ణీత చార్జీ వసూలు చేస్తారు. రాయితీలు యథాతథంగా వర్తిస్తాయని ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు.

22 గంటల్లోపు..రెండు బస్సుల్లో ప్రయాణించినా ఒక టికెట్ రిజర్వేషన్ చార్జీ మాత్రమే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. తొలి బస్సు నుంచి దిగిన తర్వాత 2 నుంచి 22 గంటల వ్యవధిలో రెండో బస్సు ఎక్కి ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. మార్గ మధ్యలో వ్యాపారం, వ్యక్తిగత పనులు చూసుకోవాలనుకునే ప్రయాణికులకూ ఈ విధానం అనువుగా ఉంటుందని తెలిపారు. తొలి దశలో 137 దూరప్రాంత బస్సు రూట్లలో మల్టీ సిటీ జర్నీ రిజర్వేషన్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపిన ఆర్టీసీ.. ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ ను బట్టి దశలవారీగా మరిన్ని రూట్లలో విధానం పెంచనున్నట్లు తెలిపింది. నూతన విధానాన్ని దూరప్రాంత ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కోరారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details