ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' - విజయవాడ నేటి వార్తలు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ విజయవాడలో ఏపీఎన్​జీఓ సంఘం నేతలు ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

APNGO leaders protest in vijayawada against vizag steel plant privatization
విజయవాడలో ఏపీఎన్​జీఓ సంఘం నేతల ర్యాలీ

By

Published : Mar 5, 2021, 7:40 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు తలపెట్టిన బంద్​లో భాగంగా విజయవాడలో ఏపీఎన్​జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నష్టాలను సాకుగా చూపి పరిశ్రమను ప్రైవేట్ వారికి కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. స్వల్ప నష్టాలలో ఉన్న కర్మాగారానికి గనులు కేటాయిస్తే లాభాలు వస్తాయని సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details