దళితులపై దాడి చేయడం జగన్ పాలనలో సాధారణమైపోయిందని.. ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. మొన్న డాక్టర్ సుధాకర్, నిన్న దళిత మెజిస్ట్రేట్ రామకృష్ణ నేడు వరప్రసాద్ ఇలా దళితులపై వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ లేదన్న ఆయన.. వారి గౌరవానికి భంగం కలిగే చర్యలను దళిత సంఘాలు, బీసీ, మైనార్టీ వర్గాలు ఖండించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో వరప్రసాద్‌పై దాడి, శిరోముండనం ఖండిస్తూ, ఈ సంఘటనలో ప్రమేయమున్న వైకాపా నాయకులు, పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
'వైకాపా పాలనలో దళితులకు రక్షణ లేదు'
వైకాపా పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో మాట్లాడిన ఆయన దాడికి పాల్పడ్డ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్