ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాకప్ లో యువకుడు మృతి...ముగ్గురి పోలీసులపై వేటు - Lockup_Death

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసు స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యపై విచారణ పూర్తయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై వేటుపడింది.

యువకుడు లాకప్ డెత్

By

Published : Apr 17, 2019, 9:42 AM IST

Updated : Apr 19, 2019, 9:41 PM IST

విజయవాడలోని బసవపున్నయ నగర్‌లోని ఓ ఇంట్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు... అజిత్ సింగ్‌నగర్​లోని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... అతన్ని ఠాణాలోనే ఉంచారు. తెల్లారేసరికి ఆ యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు విచారణకు ఆదేశించారు. శాఖాపరమైన విచారణ పూర్తయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లలను సస్పెండ్ చేస్తూ విజయవాడ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

పోలీసు స్టేషన్‌లో ఉరివేసుకున్న యువకుడు
Last Updated : Apr 19, 2019, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details