సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చివరి సమయంలో చేరుకున్న ఓటర్లకు నిరాశ ఎదురైంది. చివరి గంటలో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ... తమ ఓట్లు గల్లంతయ్యాయన్న విషయం తెలుసుకొని నిరాశ చెందారు. ఎన్నికల నిర్వహణ అధికారులపై మండిపడ్డారు. చనిపోయిన వారి ఓట్లు కూడా ఉన్నాయని.. కానీ తమకు గుర్తింపు కార్డు ఉన ఓటరు జాబితాలో ఓటు లేదని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువురాని వాళ్ళు తమ ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు.
ఉత్సాహంగా వెళ్లారు... ఓటు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు - election
ఓటు వేసేందుకు చివరి సమయంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఓటర్లకు నిరాశ ఎదురైంది. ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లు గల్లంతయిన ఓటర్లు