సమ సమాజ స్థాపనకు శ్రమ సమాజమే మూలమని, అలాంటి శ్రమను గౌరవించడం అందరి కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కార్మికులు, శ్రామికులకు ఆయన మే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షికాగో నగరంలో 8 పని గంటల సాధనలో కార్మికవర్గ విజయసంకేత స్ఫూర్తిగా నిర్వహించే 'మే'డే... అంతర్జాతీయ శ్రామికలోకానికి స్ఫూర్తి అని తెలిపారు. దేశప్రగతికి గీటురాయిగా భావిస్తున్న పారిశ్రామికాభివృద్ధికి... బాట వేసేది కార్మికులు, కష్టజీవులేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2.57 కోట్ల మందికి చంద్రన్న బీమా పథకం వర్తింపజేశామని చంద్రబాబు చెప్పారు. వీరిలో 7.77లక్షల మంది రైతుకూలీలేనన్నారు. దురదృష్టవశాత్తు గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన కార్మిక, శ్రామిక కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం వల్ల 671 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. అంతరించి పోతున్న 125 కుల వృత్తులపై దృష్టి కేంద్రీకరించామన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములైన కార్మిక వర్గ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
శ్రామికులకు 'మే'డే శుభాకాంక్షలు: సీఎం - సీఎం చంద్రబాబు
రాష్ట్ర కార్మికులు, శ్రామికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములైన కార్మిక వర్గ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కార్మికులు, శ్రామికులకు 'మే'డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు