ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నివారణలో మేము సైతం అంటున్న 'ఐపీఎస్​ఓడబ్ల్యూఏ'

సమాజసేవలో మేమూ ముందుంటామంటూ... ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ స్పందిస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే యుద్ధంలో పోలీసు సిబ్బందికి మానసిక స్థైర్యాన్నిచ్చే కార్యక్రమాలు చేపడుతోంది.

By

Published : May 5, 2020, 7:58 PM IST

ap ips officers wives association services due to corona
కరోనా నివారణలో మేము సైతం అంటున్న 'ఐపీఎస్​ఓడబ్ల్యూఏ'

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏపీ ఐపీఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ తమవంతు సేవలు అందిస్తోంది. ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో ఎస్పీల సతీమణులు వాళ్లతో పాటే ఉంటూ.. పోలీసు సిబ్బందికి దగ్గరుండి వంటచేసి వడ్డిస్తున్నారు. డిజీపీ గౌతం సవాంగ్ సతీమణి షిల్లోయ్ సవాంగ్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నేడు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సతీమణి హేమామణి ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 250 మంది పోలీస్ సిబ్బందితో పాటు 400 మందికి భోజనం ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పరిధిలోని రెడ్ జోన్లలో పనిచేసే సిబ్బంది, అధికారులు, మహిళా పోలీసులు, వాలంటీర్లకు ఆహారం పంపిణీ చేశారు.

ఇవీ చదవండి.. 'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details