ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకేసారి విడుదల చేశారు. కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది. మార్కులను చూసుకుందామని ప్రయత్నించిన విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. సాయంత్రం 4గంటలకు ఫలితాలను విడుదల చేయగా... గంటలు గడుస్తున్నా ఫలితాలు అందుబాటులోకి రావట్లేదు.
సాంకేతిక సమస్య... ఫలితాల కోసం విద్యార్థుల నిరీక్షణ - ఏపీ ఇంటర్ ఫలితాల వార్తలు
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాలను చూసుకునేందుకు నిరీక్షణ తప్పడం లేదు. విడుదల చేసి గంటలు గడుస్తున్నా.. ఫలితాలు అందుబాటులోకి రావట్లేదు. సాంకేతిక సమస్య వల్ల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మొదటి, రెండో ఏడాది ఫలితాలు ఒకేసారి విడుదల చేయడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి.
ap inter result Server problem
సాంకేతిక సమస్య కారణంగా ఫలితాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం, అదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయడంతో సర్వర్‌లు మొరాయించాయి. ఫలితాల కోసం వెతుకుతుంటే..సేవలు అందుబాటులో లేవని సందేశం వస్తుంది. దీంతో పరీక్ష ఫలితాల విషయంలో ప్రభుత్వ ఏర్పాట్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jun 12, 2020, 8:17 PM IST