Russia-Ukraine crisis : ఉక్రెయిన్- రష్యా ఉద్రిక్తతలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ ఉన్న ఏపీ విద్యార్థులపై మంత్రి సురేశ్ ఆరా తీశారు. ఎంతమంది ఉక్రెయిన్‌లో ఉన్నారనే విషయాలను అధికారులను అడిగి తెలుకున్నారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని చెప్పారు. విద్యార్థుల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమాచారం మేరకు అధికారులు సహకరించాలని సూచించారు.
ఉక్రెయిన్ -రష్యా మధ్య ఉద్రిక్తతలు.. ఏపీ విద్యార్థుల క్షేమంపై ప్రభుత్వం ఆరా - రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం
Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ విద్యార్థుల క్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఈ మేరకు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మంత్రి సురేశ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.
ఉక్రెయిన్ -రష్యా ఉద్రిక్తతలు