Rains in AP: దక్షిణ కోస్తాలో ఒకటిరెండు చోట్ల మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.
*సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా ఉలవపాడులో 37.75 మి.మీ, నెల్లూరు జిల్లా కావలిలో 23.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో తేలికపాటి వానలు కురిశాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల మధ్య నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి.