ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విదేశీ దంపతులు... అనాథ బాలికలకు అమ్మానాన్నలయ్యారు - orphans

కృష్ణాజిల్లాలోని ఇద్దరు అనాథ బాలికలను విదేశీ దంపతులు అక్కున చేర్చుకున్నారు. వీరిని దత్తత తీసుకుని అమ్మానాన్నలయ్యారు.

అమెరికా దంపతుల మానవత్వం

By

Published : Aug 28, 2019, 6:54 PM IST

కృష్ణా జిల్లా ప్రభుత్వ శిశు గృహానికి చెందిన ఇద్దరు బాలికలను విదేశీ దంపతులు దత్తత తీసుకున్నారు. అమెరికాలోని మిస్సిసిపి, విస్కన్సన్ రాష్ట్రాలకు చెందిన రెండు జంటలు... పిల్లల్ని దత్తత తీసుకునేందుకు భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో శిశుగృహానికి చెందిన ఇద్దరు బాలికలను చట్టప్రకారం దత్తత ఇచ్చినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. మచిలీపట్నం, బుద్దవరం శిశు గృహల్లోని ఇద్దరు బాలికలను రెండు విదేశీ కుటుంబాలకు దత్తత ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దత్తతకు వెళ్లిన బాలికలకు ఒక్క రోజులోనే పాస్ పోర్టు, రెండు రోజుల్లో వీసా మంజూరు అవుతాయన్నారు. బాలికలను దత్తత తీసుకున్న రెండు జంటలను కలెక్టర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details