పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమస్యను గుర్తించడంలో విఫలమైనందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే ప్రజలు వింత వ్యాధితో ఇబ్బందులు పడుతుంటే... సమస్య ఏమిటో తెలియదని మంత్రి చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా... చంద్రబాబు, తెదేపా నేతలను విమర్శిస్తూ మంత్రులు కాలక్షేపం చేస్తున్నారని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం... తన మంత్రుల అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చాలని చూస్తోందని ఆక్షేపించారు.