కృష్ణా జిల్లా నూజివీడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు. దశాబ్దాలుగా భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు... ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నగర రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి మండల తహసీల్దార్ కార్యలయం దగ్గర రాస్తారోకో చేశారు. అనంతరం ఎమ్మార్వో సురేష్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. మూడు తరాలుగా వ్యవసాయం కొనసాగిస్తున్న సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చలసాని రామారావు డిమాండ్ చేశారు. గడిచిన మూడు సోమవారాలు స్పందన కార్యక్రమాల ద్వారా పత్రాలు అందిస్తూ రైతులు గోడు వెళ్లబోసుకున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు.
నూజివీడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన - నూజివీడు తాజా సమాచారం
సన్న, చిన్నకారు రైతాంగానికి ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు.
నూజివీడులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన